మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ
గాయపడ్డ వారిలో కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, మరో అటెండర్ ఖాజా ఉన్నారు. వారిని స్థానికులు మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కావాలంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు