బిగ్‌బాస్-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఫైనల్ వీక్‌కు చేరుకుంది. టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టమైంది. కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో టాప్-5లో సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఉన్నారు. వీరిలో బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తారో ఈ వారం తేలిపోనుంది. ఎక్కువ శాతం సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే యూట్యూబర్ షణ్ముఖ్‌కు ఫాలోయింగ్ బాగా ఉండటం.. బయట అతడి స్నేహితురాలు దీప్తి సునయన పెయిడ్ ఓట్లు వేయిస్తుందని ప్రచారం జరుగుతుండటంతో షణ్ముఖ్ టైటిల్ గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. టైటిల్ ఎవరు గెలుచుకున్నా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, షాద్ నగర్ దగ్గర రూ.25 లక్షలు విలువ చేసే సువర్ణ కుటీర్ ల్యాండ్ బహుమతులుగా దక్కనున్నాయి.
Read Also: ఆ ‘కిక్’ నాకు ‘అఖండ’ సినిమాతో వచ్చింది: అల్లు అర్జున్
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక హౌస్ నుంచి బయటకు వెళ్తున్న కాజల్‌కు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ఐదుగురు సభ్యులకు ఏం ట్యాగ్స్ ఇస్తావో చెప్పమని అడిగాడు. దీంతో సన్నీకి 5 టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మానస్‌కు 5 టైమ్స్ ఫ్రెండ్‌షిప్, సిరికి 5 టైమ్స్ ఎమోషన్, శ్రీరామచంద్రకు 5 టైమ్స్ యాక్షన్, షణ్ముఖ్‌కు 5 టైమ్స్ డ్రామా అనే ట్యాగ్స్‌ను కాజల్ ఇచ్చింది. అంతకుముందు పాత హౌస్‌మేట్స్.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిని వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. ముందుగా జెస్సీ తన స్నేహితుడు షణ్ముఖ్‌కు ప్రశ్న సంధించాడు. ‘షన్ను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. వేరే జనాలు ఏం అనుకుంటున్నారో.. నువ్ ఎప్పుడైనా ఆలోచించావా..?’ అని ప్రశ్నించాడు. దానికి షణ్ముఖ్.. ‘సిరితో నా రిలేషన్ ఏంటో నీకు తెలుసు.. కానీ అది బయటకు ఎలా వెళ్తుందో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చిన తరువాతనే తెలిసింది.. సిరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తనకి ఎప్పటికీ సపోర్ట్ సిస్టంలా ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
సన్నీకి యానీ మాస్టర్ తన ప్రశ్నను సంధించింది. తాను హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తనను బ్యాక్ బిచ్ చేస్తున్నావంటూ సన్నీని ప్రశ్నించింది. దీనికి సన్నీ స్పందిస్తూ.. తానెప్పుడూ అలా చేయలేదని.. తన ఒపీనియన్ మాత్రమే చెప్పానని స్పష్టం చేశాడు. యానీ మాస్టర్ చెప్పేవన్నీ చెబుతుంది కానీ దానిపై స్టాండ్ తీసుకోరని.. ఆమె ఎప్పటికీ తనకు మంచి ఫ్రెండ్ అని సన్నీ చెప్పాడు. మానస్‌ను ప్రియాంక ప్రశ్న వేసింది. ‘మానస్.. నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. ఇన్ని హౌస్‌లో నువ్వు నన్ను భరించావా..? లేక నటించావా..? ఎందుకంటే బయటకొచ్చాక కొన్ని ఎపిసోడ్స్ చూశాను’ అని ప్రశ్నించింది. దీనికి మానస్ స్పందిస్తూ… ‘భరించాను.. ఎప్పుడూ నటించలేదు. జెన్యూన్ ఎమోషన్స్ డిస్ ప్లే చేశాను’ అంటూ బదులిచ్చాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!