పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Read Also: వ్యాక్సిన్ వేయించుకోకపోతే రేషన్, పెన్షన్ కట్
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారని… బ్యాంకులలో రుణాలు తీసుకోమని లబ్ధిదారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాలపై పగ తీర్చుకునేందుకే జగన్ తన ఆసక్తి చూపిస్తున్నారని.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందివ్వాలనే ఆలోచన ఎంత మాత్రం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. జగన్ పాలనలో ఇల్లు లేదు, బిల్లు లేదు, ఆఖరికి కట్టిన ఇల్లు కూడా ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.
13వ తేది ఉదయం 9 గం.ల నుండి…
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) December 12, 2021
కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష… pic.twitter.com/xCUJjfVjkE