ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలతో చాలామంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 20న తిరుపతిలో పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కాగా వరదల్లో మృతి చెందిన 48 మంది […]
మధ్యప్రదేశ్ పెట్రోలియం శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్వాలియర్‌లోని హజీరా పాఠశాలను శనివారం నాడు మంత్రి ప్రద్యుమ్న సింగ్ సందర్శించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై ఆయన వివరించారు. అయితే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో వినియోగించుకోలేకపోతున్నామని.. దుర్గంధంతో అటువైపు వెళ్లలేకపోతున్నామని ఓ విద్యార్థిని మంత్రి దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. Read Also: మా పథకం వల్లే దేశంలో […]
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారమే జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మూవీ ’83’ యూనిట్‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్, శ్యామ్‌సింగరాయ్ యూనిట్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఏ సినిమాకైనా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలంటే బిగ్‌బాస్ సరైన వేదిక కాబట్టి ఆయా మూవీ యూనిట్స్ బిగ్‌బాస్ ఫినాలేను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి హీరో నాని, హీరోయిన్ […]
బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలి. ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి […]
దేశంలో లింగ నిష్పత్తిలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో మగవారు ఎక్కువగా ఉండగా ఆడవారు తక్కువగా ఉండేవారు. అందుకే మగాళ్లకు పిల్ల దొరకడం లేదని మన పెద్దవాళ్లు కామెంట్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడు దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని శనివారం నాడు లోక్‌సభలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మహిళలు, పురుషుల నిష్పత్తి 1020: 1000గా ఉందని జాతీయ ఆరోగ్య సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దేశంలో 1020 మంది మహిళలు ఉంటే… […]
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు. Read Also: […]
హైదరాబాద్ నగరంలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ దశాబ్దంలోనే డిసెంబర్ నెలకు సంబంధించి అత్యంత చలి రోజుగా 18వ తేదీ (శనివారం) రికార్డు సృష్టించింది. శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీల […]
✍ నేడు అన్నవరం సత్యనారాయణస్వామికి కోటి తులసి దళార్చన.. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా స్వామివారికి కోటి తులసి దళార్చన✍ నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన… మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడు వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న చంద్రబాబు✍ తిరుపతి: నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ జాతీయ సదస్సు✍ నేడు వరంగల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. కోర్టు కాంప్లెక్స్, నల్సార్ యూనివర్సిటీలో బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించనున్న సీజేఐ, […]
గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. తొలుత టెస్టులకు వైస్ కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ.. అతడు గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో తాజాగా కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. Read Also: ఒలింపిక్స్ రేసులోకి హీరో మాధవన్ తనయుడు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత […]
సాధారణ హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు 11 సినిమాలు చేయగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టాడు. ఇప్పుడు 12వ సినిమాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమానే ఆర్.ఆర్.ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ […]