తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. Read Also: సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:★ చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, […]
హైదరాబాద్: కాచిగూడ ఐనాక్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. సమయానికి సినిమా వేయలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్ ఐనాక్స్ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా లైసెన్స్ అథారిటీ కింద మరో రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూన్ 22న తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్‌కు వెళ్లాడు. అయితే సినిమా టిక్కెట్‌పై ఉన్న సమయం […]
భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సచిన్ స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, పౌరులను ట్విటర్ వేదికగా సచిన్ అభినందించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్ కండిషన్‌లో ఉన్న తన స్నేహితురాలిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని.. […]
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో భారీ మారథాన్ జరగనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్ల మారథాన్‌ను నిర్వహించనున్నారు. ఈ మారథాన్‌కు ఇప్పటికే 6వేల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ 10వ ఎడిషన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల […]
★ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు… నిత్యావసర ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు.. యూపీలో పాదయాత్ర ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక★ నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పున:ప్రారంభం.. తూ.గో. జిల్లా పోచవరం నుంచి ప్రారంభం కానున్న పాపికొండల విహారయాత్ర★ విజయవాడ: నేడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇస్రో ఛైర్మన్ డా.శివన్, గౌరవ అతిథిగా హాజరుకానున్న ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీ […]
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read Also: […]
మహిళలకు గర్భం దాల్చడం అనేది వారి జీవితంలో కలిగే మధురానుభూతి. మహిళలు గర్భం దాలిస్తే కడుపులోని బిడ్డ గర్భాశయంలో పెరగడం సాధారణ విషయం. కానీ ఓ మహిళకు మాత్రం కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతుండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే… కెనడాలోని 33 ఏళ్ల మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన తరువాత 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె చెకప్ చేయించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ […]
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. Read Also: హన్మకొండలో ఒమిక్రాన్ కలకలం..ఓ […]
భారత ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా సమయంలో తమకు అందించిన మద్దతుకు గుర్తింపుగా తమ దేశ అత్యున్నత అవార్డు ‘నగ్‌డగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్రాజు జిగ్మే ఖేసర్నగ్మే వాంగ్చుక్సూచించినట్లు తెలిపింది. ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే. Read […]
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు […]