బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారమే జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మూవీ ’83’ యూనిట్‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్, శ్యామ్‌సింగరాయ్ యూనిట్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఏ సినిమాకైనా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలంటే బిగ్‌బాస్ సరైన వేదిక కాబట్టి ఆయా మూవీ యూనిట్స్ బిగ్‌బాస్ ఫినాలేను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి బిగ్‌బాస్ స్టేజీమీదకు వచ్చినట్లు సమాచారం.
గతంలో బిగ్‌బాస్ సీజన్-2కు హోస్టుగా వ్యవహరించిన హీరో నాని.. ఇప్పుడు గెస్టుగా హాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా హీరో నాని ఫీలింగ్ తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సీజన్-2 సమయంలో అప్పటి కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హీరో నానిని దారుణంగా ట్రోల్ చేయడంతో తరువాతి సీజన్‌లకు నాని దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా అతడు మళ్లీ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చాడు. కాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
ఇక బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాప్-5 కంటెస్టెంట్లలో తొలుత సిరి, ఆ తర్వాత మానస్ ఎలిమినేట్ కాగా… మూడో వ్యక్తిగా షణ్ముఖ్ బయటకు వచ్చినట్లు సమాచారం. రన్నరప్‌గా నిలుస్తాడని భావించిన షణ్ముఖ్ నిరాశపరిచాడని.. అతడి స్థానంలో శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడని తెలుస్తోంది. అటు విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ రూ.50 లక్షలతో పాటు బైక్, సువర్ణభూమి ఇంటి స్థలం దక్కించుకున్నాడని టాక్.
ఈ కింది వార్త కూడా చదవండి: