భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు మరోసారి ఎన్నికైంది. ఈ విషయాన్ని స్వయంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. పీవీ సింధుతోపాటు మరో ఐదుగురిని బ్యాడ్మింటన్ వరల్డ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా నియమించినట్లు BWF ప్రకటించింది. ఈ ఆరుగురు 2025 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. Read Also: వైరల్: వధూవరుల డ్యాన్స్… మధ్యలో అనుకోని అతిధి రావడంతో… కొత్త నియామకం […]
ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం […]
తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. Read Also: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాస్ చేసేందుకు విద్యాశాఖ యోచన..? మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ […]
మహారాష్ట్రలోని శివసేన సీనియర్ నేత, మంత్రి గులాబ్‌రావు పాటిల్ ఆదివారం నాడు చేసిన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన నియోజకవర్గంలోని ధరంగావ్‌లో రోడ్లు నటి హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సందర్భంగా నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రోడ్లను నటీనటుల బుగ్గలతో పోల్చే సంప్రదాయం ఆర్జేడీ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఈ సంప్రదాయానికి తెరతీయగా… ఇప్పుడు శివసేన […]
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్లోపాల్గొని నాదల్ తన స్వదేశం స్పెయిన్కుచేరుకున్నాడు. ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఇతడికి కరోనా సోకినట్లు స్పష్టమైంది. దీంతో ‘నేను కొంత బాధలో ఉన్నాను. ఈ సమస్య నుంచి త్వరగా […]
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా […]
వైసీపీ నేతలకు పని లేక ఆడవారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నిజంగా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని మంత్రి కొడాలి నాని అన్నారు. తాము విమర్శలు చేయకున్నా చేశామని చెప్పిన్నోళ్లు కూడా సంకనాకి పోతారని చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీలో రోజాను కంటతడి పెట్టించారని, లక్ష్మీపార్వతిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకువెళ్లారని.. దానికి […]
స్విటర్లాండ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం అక్కడి సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్‌లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని […]
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్ […]
ఏపీ హైకోర్టుపై ఇటీవల విమర్శలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే తాను చెప్పానని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విషయం తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. […]