Ramesh Nalam
Author- NTV Telugu-
టీమిండియాతో టెస్ట్ సిరీస్… దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ
ఈనెల 26 నుంచి టీమిండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో నార్జ్ స్థానంలో కొత్త ఆటగాడిని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది. Read Also: అత్యాచారం కేసులో చిక్కుకున్న […] -
‘డీ మార్ట్’కు వెళ్లే కస్టమర్లకు శుభవార్త
సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్‌కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు. Read Also: సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న […] -
ఏపీలో 95.. తెలంగాణలో 172… కరోనా కేసుల లెక్క..!!
ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా […] -
సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు
దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్‌బీడీ పామ్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. Read […] -
నాలుగు జిల్లాలకు ‘దళిత బంధు’ నిధులు విడుదల
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నాడు నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Read Also: గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!! సూర్యాపేట జిల్లా […] -
గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!!
ఇటీవల కాలంలో ఖమ్మం వ్యక్తులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వాళ్లు తమ టాలెంట్‌తో వార్తల్లో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. మన్ననలే కాదు పాపులర్ కూడా అయిపోయారు. జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు, మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్-5 షోలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి […] -
అత్యాచారం కేసులో చిక్కుకున్న స్టార్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ల రాసలీలలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గతంలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజంపై రాసలీలల ఆరోపణలు వెలుగు చూడగా… తాజాగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ యాసిర్ షా అత్యాచారం కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారింది. యాసిర్ షా, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణలు చేసింది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ షా తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ […] -
ఈ ఏడాదిలోనే ఈరోజు చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?
ఈ ఏడాది మొత్తంలోనే ఈరోజు (డిసెంబర్ 21) చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే డిసెంబర్ 21వ తేదీని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. ఉత్తర అర్ధగోళం మంగళవారం నాడు తన కక్ష్యలో సూర్యుడి నుంచి దూరంగా వంగి ఉన్నందున సంవత్సరంలో అతి తక్కువ రోజుగా అనుభవిస్తుందని వారు తెలిపారు. సూర్యుడి నుండి దూరంగా వంగి ఉన్నందున తక్కువ సూర్యరశ్మిని పొందుతుందని.. దీంతో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుందన్నారు. Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ […] -
రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడం సరైందేనా? ఇప్పుడు రోహిత్.. తర్వాత ఎవరు?
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో […] -
ఏపీకి ప్రత్యేకహోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చాం: కేంద్ర ప్రభుత్వం
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ మంగళవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..