దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్ […]
ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీ చట్టం 2021 ప్రకారం యాంటీ ఇండియా, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలతో 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. Read Also: మహిళలకు రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన ప్రధాని మోదీ […]
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్‌కు […]
పంజాబ్‌లోని లుథియానాలో దారుణం వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే… లుథియానా శివారులోని మెహర్బన్ ప్రాంత పరిధిలోని చుహర్వాల్ గ్రామంలో ఈనెల 18న రాత్రి కౌర్ అనే వృద్ధురాలితో తల్లి, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కౌర్ ప్రార్థనల కోసం గురుద్వారాకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. కౌర్ చేతబడి చేస్తుందన్న ఆరోపణలతో […]
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సీఎం జగన్‌కు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిమిషాల వ్యవధిలో […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని […]
ఈనెల 21న (మంగళవారం) ఏపీ సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని రోజా భావిస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న రోజా.. ఈ ఏడాది నగరి నియోజకర్గంలోని ముస్లిం […]
ఢిల్లీ హైకోర్టు ఆక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా బేగం అనే మహిళ… ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. దీంతో ఎర్రకోటను తనకు అప్పగించాలని లేదా తగిన పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టును కోరింది. 1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయని… బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ […]
తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also: […]