ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఫైనల్లోకి భారత యువ జట్టు అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరింది. తొలుత బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ 90 పరుగులు చేశాడు. విక్కీ (28), కెప్టెన్ యష్ (26), రాజ్ బవా […]
ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. ఒమిక్రాన్ సోకిన బాధితులను ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. Read Also: మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ మరోవైపు ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి […]
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు. Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు […]
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్‌లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. […]
టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ […]
దేశంలోని బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. డిసెంబర్ 31తో ముగియనున్న కేవైసీ అప్‌డేట్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. Read Also: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర మనీ […]
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని నట్టికుమార్ ప్రకటించాడు. ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి నట్టికుమార్ ధన్యవాదాలు తెలిపాడు. జీవో నంబర్ 35ను రద్దు చేయాలంటూ వైజాగ్ ఎగ్జిబిటర్లు ఎవరూ న్యాయస్థానానికి వెళ్లలేదని.. 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారని నట్టికుమార్ ఆరోపించాడు. Read Also: మహేష్ […]
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. రామతీర్థం ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసులో తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఇటీవల జరిగిన కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. Read Also: తిరోగమనం వైపు పీఆర్సీ..! మళ్లీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ ఈ ఘటన నేపథ్యంలో అశోక్ గజపతిరాజుపై రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు పోలీసులకు ఫిర్యాదు […]
కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల […]
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 305 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే భారత బౌలర్లు అవుట్ చేశారు. దీంతో 113 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో ఎల్గర్(77), బవుమా(35), డికాక్(21) తప్ప మిగతా వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో […]