ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లోనే […]
దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని […]
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు […]
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు […]
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం మధ్యాహ్నం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్‌ను స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేసి శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో […]
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా… మంగళవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిక్కెట్ల కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఫిల్మ్ గోయర్ సభ్యుడు రాకేష్ రెడ్డి ఇచ్చిన రిపోర్టును కమిటీ అభినందించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి రాకేష్‌రెడ్డి సమగ్రంగా నివేదిక తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లతో థియేటర్ల నిర్వహణ చాలా కష్టమని ఓ ఎగ్జిబిటర్ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బి, […]
ఐపీఎల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌కు ఇప్పటివరకు స్పాన్సర్‌గా కొనసాగుతున్న చైనా కంపెనీ ‘వివో’తో బీసీసీఐ బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. వివో స్థానంలో భారతీయ కంపెనీ టాటా రానున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి టాటా గ్రూప్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. దీంతో త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 టైటిల్ స్పాన్సర్‌గా టాటా కంపెనీ వ్యవహరించనుంది. Read Also: మయాంక్‌కు నిరాశ.. ఐసీసీ ‘ప్లేయర్ […]
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్‌లు వచ్చినా […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది. […]