తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిత్యసేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. తొలుత ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు వీఐపీలు తిరుమలకు వస్తున్నారు. మొత్తం 11 మంది మంత్రులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రానున్నట్లు టీటీడీ అధికారులు […]
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు . తాము ప్రజలను ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి […]
ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగులతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 317ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతల ఆందోళనతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే సీతక్కను బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read […]
కరోనాకు మందును పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒమిక్రాన్ మందులో ఏఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆనందయ్య ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయుష్ […]
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్ద్ చేసిన ట్విట్‌ను డిలీట్ చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశంలో బీజేపీని విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌కు సైనా నెహ్వాల్ రిప్లై ఇచ్చింది. ప్రధాని భద్రతకు విఘాతం కలిగిస్తే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదంటూ పేర్కొంది. దీంతో సిద్ధార్థ్ […]
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్‌లను గవర్నింగ్ […]
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు. Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ […]
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టు తరఫున 69 మ్యాచ్‌లు ఆడిన మోరిస్ బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. […]
జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు. పొత్తులపై అందరిదీ ఒకే […]
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. కాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. Read Also: ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ అవుట్… ఇకపై ‘టాటా’ ఐపీఎల్ […]