విజయవాడ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో సమావేశం ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. Read Also: వైఎస్ఆర్ విగ్రహం మాయం.. […]
ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. Read Also: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు […]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి […]
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు […]
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్‌లో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు, ఎన్ఎస్‌జీ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. Read Also: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి పోలీసులు ఇచ్చిన […]
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను […]
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం […]
కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో […]
పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశం విషయంలో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైనాపై సిద్ధార్థ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సిద్ధార్థ్‌పై సెక్షన్ 67 యాక్టు, ఐపీసీ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపైనే చర్చ జరిగింది. 1) […]