ఇండియా ఓపెన్-2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియా షట్లర్ జీయాంగ్‌పై భారత షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడిపోయినా ఆ తర్వాత రెండు, మూడు సెట్లలో సాధికారికంగా ఆడి లక్ష్యసేన్ గెలుపొందాడు. జీయాంగ్‌పై 19-21, 21-16, 21-12 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. కాగా టైటిల్‌పోరులో సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కియాన్యూతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. లక్ష్యసేన్ ఉత్తరాఖండ్‌కు […]
ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. Read Also: వివాదంలో విరాట్ […]
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సమయంలో భౌతిక తరగతుల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు వేచి చేస్తున్నారు. Read Also: అరెస్టు చేసిన టీచర్లందరిని వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్ ఈ మేరకు ఈనెల 17 […]
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు […]
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కేంద్ర పర్యాటకశాఖమంత్రి కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరిలో జరగనున్న రామానుజ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను చిన్నజీయర్ స్వామిని అడిగి కిషన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీరి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. Read Also: ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించిన […]
హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆయన వెల్లడించారు. Read Also: గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మన […]
టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి: […]
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో వెనుక బోగీలో ఉండే వ్యక్తిని ఇకపై గార్డు అని పిలవకూడదని.. ట్రైన్ మేనేజర్ అని పిలవాలని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు అసిస్టెంట్ గార్డును అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డును గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ గూడ్స్ గార్డును సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ ప్యాసింజర్ గార్డును సీనియర్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డును మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా మారుస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు […]
భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా విచారణ కమిటీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)కు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, కుట్ర, నిర్లక్ష్యం కారణం కాదని నివేదిక స్పష్టం చేసింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని.. కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ విఫలమయ్యాడని నివేదిక పేర్కొంది. Read Also: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎన్నిక కాగా గతేడాది […]
ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి(96) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925లో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖరశాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు, ప్రఖ్యాతులు పొందారు. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేయడంతో చంద్రశేఖరశాస్త్రి చాలా ప్రసిద్ధి. […]