తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం తాను సీఎం జగన్‌ను కలిసి చర్చిస్తే తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారంటూ కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు GiveNewsNotViews అంటూ ఓ హ్యాగ్ ట్యాగ్‌ను చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ మై ఫుల్ సపోర్ట్ అంటూ చిరంజీవికి మద్దతు తెలుపుతూ […]
కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబరు 14న జరిగిన రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు ఈ ఎన్నిక జరిగింది. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా జీవీఎల్‌కు తెలియజేసింది. పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4)(బి)తో పాటు పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం… పొగాకు బోర్డు సభ్యునిగా ఒక రాజ్యసభ సభ్యుడిని హౌస్ సభ్యుల ద్వారా ఎన్నుకుంటారు. Read […]
1) తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. 2) సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో […]
టీమిండియా జట్టులో గత రెండేళ్లుగా పుజారా, రహానెలకు బీసీసీఐ వరుస అవకాశాలను ఇస్తోంది. అయినా వాళ్లిద్దరూ అరకొర సందర్భాల్లో తప్పితే పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పుజారా అయితే రెండేళ్లుగా సెంచరీనే చేయలేదు. ఇక రహానె పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహానె ఓ ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే 10 ఇన్నింగ్సులు ఆడకుండానే జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. దీంతో జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసే ఉదాహరణ. పుజారా, […]
హైదరాబాద్ కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు […]
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న […]
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి […]
భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్‌లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్‌లో 21-7 తేడాతో, రెండో సెట్‌లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది. Read Also: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి అంతకుముందు మ్యాచ్‌లో ఏరా […]
సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. Read Also: బిగ్ బ్రేకింగ్: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి […]