Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ సమస్యలతో సతమతం అయ్యాడు. ఫామ్ కారణంగా అతడు చివరకు కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ అన్నదే రాలేదు. అయితే ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మేరకు కెరీర్‌లో […]
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ఇప్పటికే రెండు వన్డేలలో ఓటమి చెంది సిరీస్ కోల్పోగా శనివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, అక్షర్ […]
Pan-Aadhar Linkage: మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని పన్నుచెల్లింపుదారులను ఆదాయపు పన్నుశాఖ కోరింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. తాజాగా పాన్, ఆధార్ లింకేజీ ప్రక్రియకు 2023 మార్చి 31వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా […]
GVL Narasimha Rao: రాష్ట్ర విభజన అంశంపై మరోసారి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోందని.. గతంలో వైసీపీ కూడా విభజనకు లేఖ ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. అప్పుడు అలా చేసి.. ఇప్పుడు విభజనను వ్యతిరేకించామని వైసీపీ కొత్త కహానీలు చెబుతోందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు కలవాలనే నినాదం తీసుకురావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు […]
Team India: ఒకవైపు ఆటలో రాణిస్తున్నా జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే ఏ ఆటగాడికైనా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, దేశవాళీ టోర్నీలలో రాణిస్తున్నా ఎంతో కాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం జయదేవ్ ఉనద్కట్ ఎదురుచూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన టెస్టు జట్టులో సభ్యుడు మహ్మద్ షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో అనూహ్యంగా జయదేవ్ ఉనద్కట్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు […]
AP BJP: తాను అధికారంలోకి వస్తే వడ్డీతో సహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్లపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేసింది. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారిమళ్లించి ఏపీని సీఎం జగన్ 90 శాతం నాశనం చేస్తే తాను 100 శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని బీజేపీ ట్వీట్ చేసింది. […]
Minister Roja: ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు […]
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎట్టకేలకు జూలు విదిల్చింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది. చిట్టగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడు కెరీర్‌లో చేసిన తొలి వన్డే సెంచరీని చిరస్మరణీయం చేసుకున్నాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ […]
Kollu Ravindra: టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే కానీ బ్యాక్ బోన్ కాదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ బహిరంగంగా ప్రకటించారని.. పెద్ద పీట వేయడమంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని.. […]
Team India: కొంతకాలంగా టీమిండియా పతనం దిశగా సాగుతోంది. ఆటగాళ్ల ప్రదర్శన పక్కనబెడితే తరచూ అందరూ గాయాల బారిన పడుతున్నారు. దీంతో కీలక సిరీస్‌లకు ముఖ్యమైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా ప్రదర్శన దారుణంగా ఉంటోంది. కొన్నేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో ఊహించుకోవచ్చు. దీనికి కారణం కోచ్, బీసీసీఐ చెత్త నిర్ణయాలే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ మార్పుతో పాటు కొత్త […]