Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో… మరోవైపు సినిమాల్లో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్‌కు మనసులో ఉన్నా రాజకీయాలు డబ్బులతో ముడిపడి ఉండటంతో ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందించారు. దీని కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు వార్తలు వచ్చాయి. అటు ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ పవన్ […]
Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ […]
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు. […]
BJP MP Ravi Kishan: యూపీలోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని.. జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాని కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు అని రవికిషన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు నలుగురు కంటే తక్కువ పిల్లలు ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు చేస్తోందని […]
Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్‌డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల […]
Andhra Pradesh: ఏపీలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాలలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో మాండూస్ తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గిరీషా సూచించారు. జిల్లాలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమస్యలపై కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్: […]
Young Boy: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అనూజ్ పాండే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తల తిరగడంతో కిందపడిపోయాడని అందరూ భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనూజ్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి […]
Chandra Babu: గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని.. […]
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్‌ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు […]
తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ […]