Ambati Rambabu: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని.. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, అనేక ఘోరాలు చేస్తున్నారని టీడీపీ మీడియాలో రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలా తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ […]
Vijayawada: విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణలకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తరువాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7లక్షల మంది వరకు భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభం […]
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, […]
Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా 32 మండలాలలో తుఫాన్ ప్రభావం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 778 మందికి పునరావాసం కల్పించారు. ఈ నేపథ్యంలో మాండూస్ తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున […]
Avatar-2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్‌కు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్‌టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్‌లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు. చివరకు ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంచుమించు మూడు గంటలు […]
Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు. […]
Mayank Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మయాంక్ అగర్వాల్ భార్య ఆషిదా సూద్ తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా గుండెల నిండా ప్రేమతో అయాన్ష్‌ను పరిచయం చేస్తున్నాం. ఇతను దేవుడి ఇచ్చిన ఓ బహుమతి’’ అని పేర్కొన్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆశీస్సులు అందజేస్తున్నారు. భారత […]
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా […]
Andhra Pradesh: ఏపీలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీఆర్వోలు వెల్లడించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం […]
Rivaba Jadeja: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అద్భుత రీతిలో విజయం సాధించారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా జడేజా సమీప అభ్యర్థిపై 61,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఆమె మరో జాక్‌పాట్ కొట్టారని ప్రచారం జరుగుతోంది. భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో రివాబాకు కూడా స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు పటీదార్ రిజర్వేషన్ల […]