Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- రెడ్మీ నోట్ 17 ప్రో భారత్‌లో లాంచ్
- 9,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్
- 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్
- స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్సెట్
- 50MP ప్రధాన కెమెరా, OIS, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా
- రూ.33,999 ప్రారంభ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi Note 17 Pro: రెడ్మీ నోట్ 17 సిరీస్ లో భాగంగా రెడ్మీ నోట్ 17 ప్రో (Redmi Note 17 Pro)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 9,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, హైపర్ఓఎస్ 3 వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రీమియం ఫీచర్లను మిడ్‌రేంజ్ ధరలో అందించడమే లక్ష్యంగా రెడ్మీ నోట్ 17 ప్రోను రూపొందించింది.
6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే
రెడ్మీ నోట్ 17 ప్రోలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 12-bit ప్యానెల్ కావడంతో ఏకంగా 68.7 బిలియన్ రంగులను చూపించగలదు. డిస్ప్లే గరిష్ఠంగా 3,500 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్‌లో 2,000 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
డిజైన్
రెడ్మీ నోట్ 17 ప్రోలో ఫ్లాట్ ప్లాస్టిక్ ఫ్రేమ్, గుండ్రటి అంచులతో కూడిన డిజైన్‌ను అందించారు. వెనుక భాగంలో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఫోన్ మందం సుమారు 8.6 మిల్లీమీటర్లు. చదరపు ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్లో కెమెరాల కోసం ప్రత్యేకంగా పైకి లేచిన పిల్ ఆకారపు భాగాన్ని అందించారు. ఈ ఫోన్ క్లౌడ్ బ్లూ, పర్పుల్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్లను కలిగి ఉంది.
9,000mAh భారీ బ్యాటరీ
బ్యాటరీ విషయంలో రెడ్మీ నోట్ 17 ప్రో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 9,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. సాధారణ వినియోగంలో 3.5 రోజులు లేదా అంతకంటే ఎక్కువ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్సెట్
పెర్ఫార్మెన్స్ కోసం రెడ్మీ నోట్ 17 ప్రోలో 4nm Qualcomm Snapdragon 6s Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 8GB LPDDR4X RAMతో వస్తుంది. స్టోరేజ్ విషయంలో వేరియంట్‌ను బట్టి UFS 3.1 లేదా UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.

50MP కెమెరా
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు OIS, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో హై డైనమిక్ పోర్ట్రెయిట్, నైట్ పోర్ట్రెయిట్ వంటి ఫీచర్లతో పాటు AI Creativity Suite కూడా ఉంది. దీని ద్వారా గ్లేర్ రిమూవల్, రిఫ్లెక్షన్ రిమూవల్, ఆబ్జెక్ట్ ఎరేజ్, ఇమేజ్ ఎక్స్పాన్షన్ వంటి ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది. నాలుగేళ్ల OS అప్డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని షియోమీ తెలిపింది. HyperAIలో ఆఫ్‌లైన్ ఇంటర్ప్రెటర్, స్పీచ్ రికగ్నిషన్, DeepThink Writing వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్వర్క్ లేకపోయినా కిలోమీటర్ స్థాయిలో మెసేజ్‌లు పంపుకునేలా Offline Communication ఫీచర్‌ను కూడా అందించారు.
ధర
భారత్‌లో 8GB + 128GB వేరియంట్ ధర రూ.33,999 కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ.36,999గా నిర్ణయించారు. రెడ్మీ నోట్ 17 ప్రో అమ్మకాలు సెప్టెంబర్ 17, 2026 నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్సైట్, రిటైల్ భాగస్వామ్య స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల ద్వారా గరిష్ఠంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..