ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఓ సినిమా థియేటర్‌ను తహసీల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్‌ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసీల్దార్ ప్రకటించారు. అయితే తహసీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు. Read Also: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో […]
త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఉంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. తనను వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరుతున్నాయని.. కానీ తాను మాత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాల పాటు ఆర్సీబీకి సారథ్యం […]
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. […]
ఏపీలో మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఉగాదికి ఇంకా […]
విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు […]
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ధి సమారోహం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏడోరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Read Also: మార్చి […]
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. Read Also: యువ సంచలనం యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ తమ […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు […]
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే […]
★ ఏపీలో నేడు జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులు విడుదల… 2.85 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.285 కోట్లు జమచేయనున్న సీఎం జగన్.. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం★ నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు★ కడప: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు ఆందోళనలు… జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు★ నేడు హైదరాబాద్ రానున్న కేంద్ర […]