ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.
శ్రీ చరణి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 800 రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించింది. ప్రస్తుతం ఆమె 804 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ ఘనత సాధించడం ద్వారా భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక రికార్డు తన పేరు మీద లిఖించుకున్నారు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆమె ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది.
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ఇదే టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నిలిచిన మరో స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ కూడా తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు బ్యాటింగ్ విభాగంలోనూ భారత అమ్మాయిల జోరు కొనసాగింది. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచిన షెఫాలీ వర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో ర్యాంకును సొంతం చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు స్మృతి మంధాన ఐదవ స్థానంలో, హర్మన్‌ప్రీత్ కౌర్ పదవ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్ల విభాగంలోనూ షెఫాలీ వర్మ అగ్రగామిగా దూసుకుపోతూ తన కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లను సాధించింది. మొత్తంగా ఆసియా కప్ గెలుపుతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?