★ నేటితో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఏడాది పూర్తి.. 365 జెండాలతో నిరసన తెలపనున్న కార్మిక సంఘాలు
★ తూ.గో.: నేడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
★ తూ.గో.: నేడు ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణం
★ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. యాదాద్రిలో యాగశాలను ప్రారంభించనున్న కేసీఆర్.. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభం.. సా.4 గంటలకు రాయగిరిలో కేసీఆర్ బహిరంగ సభ
★ హైదరాబాద్ ముచ్చింతల్‌లో వైభవంగా 11వ రోజు సహస్రాబ్ది ఉత్సవాలు.. నేడు అష్టాక్షరీ మహామంత్ర జపం, లక్ష్మీనారాయణ మహాయాగం.. నేడు సమతామూర్తిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
★ నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రుద్రపూర్‌లో ఎన్నికల ప్రచారం, బహిరంగ సభ
★ బెంగళూరు: నేడు, రేపు ఐపీఎల్ మెగా వేలం.. వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 590 మంది ఆటగాళ్లు.. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న 10 ఫ్రాంచైజీలు.. ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.560 కోట్లు ఖర్చు చేయనున్న ఫ్రాంచైజీలు