తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఈ మేరకు వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాలలో పర్యటించిన కేసీఆర్.. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోతల పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల ప్రజలకు […]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లను బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వెంకటాద్రి థియేటర్ వద్ద, కోణార్క్ థియేటర్ వద్ద చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో 17 మంది మరణించారు. సైకిల్‌పై టిఫిన్ బాక్సులో ఉగ్రవాదులు బాంబులు పెట్టడంతో సంభవించిన ఈ పేలుళ్లలో 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, […]
✪ నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం✪ నేడు విశాఖ తూర్పు నావికాదళం ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ.. పాల్గొననున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఐఎన్ఎస్ సుమిత్ర నౌక ప్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి.. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో పాల్గొననున్న రాష్ట్రపతి.. ప్రెసిడెంట్ పదవీకాలంలో ప్లీట్ రివ్యూ చేయడం ఆనవాయితీ✪ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష✪ విజయవాడ: నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 […]
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) మంచి స్కోరు అందించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత […]
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే (నంబర్ 17230) రైలును మార్చి 5వ తేదీ నుంచి 16 వరకు మళ్లీ 18వ తేదీ నుంచి 21 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలును కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, మవెలికర మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు తిరువనంతపురం-సికింద్రాబాద్ మధ్య నడిచే […]
ఇంటర్ చదివిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏటా వివిధ పోటీ పరీక్షలు జరుగుతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో దీనికి జోనల్ ఆఫీసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, గువాహటి, అల్‌హాబాద్, ముంబైలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. చండీగఢ్, రాయ్‌పుర్‌లో సబ్ జోనల్ ఆఫీసులు ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ప్లస్ 2 లెవల్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సిదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారుల బ్రతుకులు వలసల మీద ఆధారపడకూడదని తమ ప్రభుత్వం ప్రణాళికల ఆధారంగా ముందుకు వెళ్తుందని ఆయన వివరణ ఇచ్చారు. సీఎం చేపలు అమ్ముకోవాలా, మటన్ అమ్ముకోవాలా అని పవన్ అడుగుతున్నారని.. మత్స్యకారుల బ్రతుకులు మారకూడదా అని ప్రశ్నించారు. మత్స్యకారులను ఎంటర్‌పెన్యూనర్లుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అప్పలరాజు తెలిపారు. చరిత్రలో తొలిసారి సినిమా ప్రమోషన్ కోసం రాజకీయాలను […]
ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వులలో అధికారులు స్పష్టం చేశారు. ఏపీ భవన్, హైదరాబాద్‌లలో పనిచేసే […]
హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని దుండిగల్‌లో ఏటీఏం కేంద్రాలకు డబ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారయ్యాడు. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే యువకుడు డ్రైవర్‌గా చేరాడు. శనివారం మధ్యాహ్నం రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్‌లతో కలిసి సాగర్ రైటర్స్ సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13 […]
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలను బట్టే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ ఓ వైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం లేదు. దీనికి కారణంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే. గత ఏడాది నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 14 డాలర్లు […]