టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కావాలని సూచించాడంటూ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే సాహా వ్యాఖ్యలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదని తెలిపాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలకు కారణమైన సాహాపై తనకు గౌరవం కూడా ఉందన్నాడు. జట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ కఠినంగా ఉంటామని.. ఆటగాళ్లను తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయడం లేదో కారణాన్ని […]
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా […]
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ నేతలతో […]
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రానున్నారు. స్వయంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జగన్ […]
భారత్‌లో కరోనా పాజిటివ్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 20 రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. తాజాగగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524కి చేరింది. తాజాగా 206 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,12,109కి చేరింది. డిచిన 24 గంటల్లో దేశ […]
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం రాజకీయ వర్గాలను కలవరపరుస్తోంది. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ పరిణామాలే హఠాన్మరణానికి కారణంగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. దుబాయ్ టూర్ ముగించుకుని ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి గౌతమ్‌రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మంత్రి మృతి చెందారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తండ్రి మేకపాటి రాజమోహన్ […]
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినా అతడు […]
ఏపీలో వాహనదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇకపై ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడానికి వీలుంటుంది. కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుంది. అర్హత లేని వారికి డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తే రూ.5వేలు ఫైన్ పడుతుంది. ఇలా ట్రాఫిక్ జరిమానాలను భారీగా ఏపీ ప్రభుత్వం పెంచేసింది. ఈ నిబంధనలపై గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. […]
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. […]