ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఈవెంట్ ఉంటుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అయితే ఈనెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని కూడా హాజరుకానున్నారు.
ఇప్పటికే భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల కాగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో అతివేగంగా 7 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా భీమ్లానాయక్ ట్రైలర్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. తమన్ మ్యూజిక్ సమకూర్చిన ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకుడు. ఈనెల 25న భారీస్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పేటీఎం, బుక్ మై షోలలో టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
POWER STORM ALERT 🚨 🌪#BheemlaNayakTrailer Hits Fastest Ever 𝟕 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Views!🔥
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
➡️https://t.co/4JcF3ZHDyZ#BheemlaNayakOn25thFeb ✨#BheemlaNayak @PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @vamsi84 @NavinNooli pic.twitter.com/ep8b2nCT83