Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్ […]
Secunderabad: మరో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తుది మెరుగులు తీర్చిదిద్దే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణ రూపకల్పన ప్రూఫ్ కన్సల్టెంట్‌గా ఐఐటీ ఢిల్లీని నియమించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా […]
Football Player: ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అమీర్ నసర్ అజాదాని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా గత కొంతకాలం నుంచి అమీర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడటం లేదు. అయితే సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్స అమిని అనే ఇరాన్ మహిళ పొలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మరణించింది. ఈ నేపథ్యంలో అమిని మరణానికి […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=WA5tCLybjtI
Mclaren 765 LT: గత ఐదేళ్లలో భారతీయ మార్కెట్‌లో ఇతర దేశాల కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. లంబోర్ఘిని, ఆస్టన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు తమ కార్లను మన దేశంలో విక్రయాలు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మెక్‌లారెన్ ప్రవేశించింది. ఈ బ్రాండ్ ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల ముంబైలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఈ బ్రాండ్ తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌కార్ మెక్‌లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో […]
IND Vs BAN: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చిట్టగ్యాంగ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా టెస్టు సిరీస్‌లో గెలవాలని భావిస్తోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు […]
What’s Today: * నేడు విశాఖ, గుంటూరు జిల్లాలలో ఏపీ సీఎం జగన్ పర్యటన * నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు.. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి నిరసనగా పిలుపు.. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు * ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ * నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ * నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్.. ఉదయం […]
CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ […]
Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా యువ పేసర్ కూడా చేరాడు. టీమిండియా పేసర్, రాజస్థాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. తన అనారోగ్య పరిస్థితి గురించి ఖలీల్ అహ్మద్ […]
Read Also: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువశక్తి పేరుతో రాష్ట్రంలోని యువత సమస్యలపై గళమెత్తనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఏడాది నుంచి పలు జిల్లాలలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 12న ఉదయం 11 గంటలకు ఈ బహిరంగ […]