Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, […]
What’s Today: * నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం.. జనవరి 14 వరకు కొనసాగనున్న ఉత్సవాలు * అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నేడు సీఎం జగన్ సమీక్ష.. హాజరుకానున్న మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్‌కు చేరిన నివేదికలు * తెలంగాణలో నేటి నుంచి 1,392 జూనియర్ లెక్చరర్ […]
VijayaSaireddy: టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా సోషల్ మీడియాలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మొన్న అచ్చన్న.. నిన్న స్వయంగా చంద్రబాబే ‘పార్టీ లేదు-బొక్కాలేదు’ అన్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోజురోజుకూ టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని చంద్రం అన్నయ్యే తేల్చేశాడని చురకలు అంటించారు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా.. పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం […]
Jogi Ramesh: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వైఎస్ జగన్ విజయవాడ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (EPL)-2022 టోర్నమెంట్‌ను మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. డిసెంబర్ 21 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈపీఎల్ టోర్నమెంట్ విజేతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగామంత్రి జోగి రమేష్ కాసేపు క్రికెట్ […]
AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో.. ఈ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ […]
Gudivada Amarnath: విశాఖలో రెండో రోజు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, ఎమ్మెల్సీలు వంశీ, వరుదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని […]
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. ముందుగా కార్యాలయ ఆవరణలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో […]
IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరంభంలోనే టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20) విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో పుజారా (12), […]
Andrew Flintoff: ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ మరోసారి ఘోర రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. 2010లో ఫ్లింటాఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి టెలివిజన్ రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు. 2019లో ప్రఖ్యాత బీబీసీ స్పోర్ట్స్ షో ‘టాప్ గేర్’లో హోస్ట్‌గా చేరాడు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో సోమవారం ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురైంది. షో టెస్ట్ ట్రాక్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం […]
Unstoppable 2: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో […]