★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
★ తిరుమల: నేడు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడో రోజు.. ఈరోజు తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్పస్వామి
★ నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వ్యాట్ సవరణ బిల్లు… నేటితో ముగియనున్న బడ్జెట్‌పై చర్చ.. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ప్రతిపాదనపై సమాధానం చెప్పనున్న సీఎం జగన్
★ నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్.. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్న సీఎం కేసీఆర్
★ తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు
★ నేడు ఉదయం 10:30 గంటలకు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు
★ నేడు హైదరాబాద్ రానున్న ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం.. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించనున్న పార్లమెంట్ సభ్యుల బృందం