Astrology: మార్చి 15, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. ఫ్యాన్సీ, కిరణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కాని పూర్తికావు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది.
వృషభం: భాగస్వామికులతో చర్చలు ఫలించవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఏ నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం చాలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. దుబారా ఖర్చులు తెలియకుండానే అవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఫర్వాలేదనిపిస్తాయి.
Also Read
- Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
మిథునం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. గృహమార్పుతో సంభవించే ఫలితాలను గమనిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. వేడుకులు, శుభకార్యాలో పాల్గొంటారు. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూల మవుతాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు.
కర్కాటకం: సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలు, ధననష్టం తప్పకపోవచ్చు,
సింహం: భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాల మొత్తంలో అధిక భాగం తీర్చగలుగుతారు. ఖర్చులు పెరిగినా భార మనిపించవు. ప్రేమికుల వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. శుభకార్యాల్లో ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
కన్య: ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పనివారలకు కలిసిరాగలదు.
తుల: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులు యత్నం ఫలిస్తుంది. ఎదుటివారి వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంటారు. మీ యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. పత్రికా రంగంలో వారికి ఒత్తిడి, చికాకులు అధికం.
వృశ్చికం: నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు అవార్డు వంటి శుభఫలితాలుంటాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
ధనస్సు: మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటు చేసుకుంటాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.
మకరం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. వాహనం, విలువైన గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి.
కుంభం: సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు.
మీనం: కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఖర్చులు కొంతవరకు నియంత్రణ చేయగలుగుతారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?