హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. చీఫ్ జస్టిస్ అవస్థి ఇంటితోపాటు కేసుతో సంబంధమున్న అందరు జడ్జిల ఇళ్ల వద్ద భద్రత పెంచారు. నిరసన కార్యక్రమాలు జరగకుండా బెంగళూరు తోపాటు కీలక నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు విదించిది. బెంగళూరులో మార్చి 15 నుంచి వారం రోజులపాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144ని విధించారు. తీర్పు నేపథ్యంలో ఈరోజు మంగళూరు, శివమొగ్గలో అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేశారు.