ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్ మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్.. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించాడు. బట్లర్ ఆట వల్లే రాజస్థాన్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో రాజస్థాన్ బ్యాటర్స్ తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఓపెనింగ్ వచ్చిన బట్లర్ చివరి వరకు ఉండి 47 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేదు. అన్ని సిక్సర్లే ఉన్నాయి. మొత్తం ఆరు సిక్సర్లు బాదాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ 37, హెట్‌మెయిర్ 42 నాటౌట్ రాణించారు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ ఒక్కో వికెట్ తీశారు.
https://ntvtelugu.com/australia-team-dominates-in-icc-women-odi-rankings/