టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు బాదిన ఆటగాడిగా రోహిత్ ఘనత దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ ఇప్పటివరకు 463 మ్యాచ్‌లు ఆడి 14,562 పరుగులు చేశాడు. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఉన్నాడు. అతడు 472 మ్యాచ్‌లు ఆడి 11,698 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో పొలార్డ్ (11,452 పరుగులు), నాలుగో స్థానంలో అరోన్ ఫించ్ (10,499 పరుగులు) ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (10,331 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
https://ntvtelugu.com/punjab-kings-player-vaibhav-arora-is-new-sensation-in-ipl-2022/