ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను జగన్ కోరనున్నారు.
మరోవైపు ఈనెల 7న ప్రస్తుత కేబినెట్‌తో చివరి భేటీని సీఎం జగన్ నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు రాజీనామా లేఖలు సమర్పించనున్నారు. ఈనెల 8న గవర్నర్‌ను కలిసి సీఎం జగన్ కొత్త మంత్రుల జాబితా ఇవ్వనున్నారు. మంత్రుల రాజీనామాలను అదేరోజు గవర్నర్ ఆమోదించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ఈనెల 11న ఉ.11:30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
https://ntvtelugu.com/ycp-mp-vijayasaireddy-demands-central-government-institutions-for-new-districts/