ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నియామకాలను అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిజ్టర్ అయి ఉండాలి. ఇంకా కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. వైద్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను చూస్తే.. జోన్-1 (విశాఖ)-974 ఖాళీలు, జోన్-2 (రాజమండ్రి)-1,446 ఖాళీలు, జోన్-3 (గుంటూరు)-967 ఖాళీలు, జోన్-4 (కడప)-1,368 ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in వెబ్ సైట్లను సందర్శించవచ్చు.
https://ntvtelugu.com/how-to-prevent-sun-stroke-in-summer/