Yanamala: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రులతో రాజీనామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కీలుబొమ్మ తరహాలో మంత్రి వర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రుల నుంచి సీఎం జగన్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి బురదను కడుక్కోవాలంటే ఈ రాజీనామాలు సరిపోవని యనమల వ్యాఖ్యానించారు. విధ్వంసక విధానాలు పాటిస్తోన్న జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాన్ని మరింతగా బూతులు తిట్టే మంత్రులు కావాలని కెబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారా అంటూ యనమల ప్రశ్నించారు. ఇప్పటి వరకు జగన్ తన అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కొత్త కెబినెట్ కూర్పుతో జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమన్నారు. వైసీపీని రాజకీయ బురద, అవినీతి, పతనం నుంచి బయట పడేసేందుకు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఏ మాత్రం ఉపయోగపడదని యనమల పేర్కొన్నారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
మరోవైపు గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంలో మిథ్యేనని మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. జగన్ చెబుతున్నదొకటి, చేస్తున్నది మరొకటిగా ఉందన్నారు. స్థానికసంస్థలను బలోపేతం చేస్తామంటూ సచివాలయాలను ఏర్పాటుచేసిన జగన్ ఆ సచివాలయాల్లో నిధులు లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత మూడేళ్ల కాలంలో పంచాయతీలకు చెందిన రూ 11వేల కోట్ల విలువైన 14, 15 ఆర్థిక సంఘం నిధులను అక్రమంగా మళ్లించుకున్నారని యనమల ఆరోపించారు.
https://ntvtelugu.com/ap-cabinet-new-ministers-expectation-list/
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!