దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది కొంచెం వాహనదారులకు ఊరట ఇచ్చే అంశమే. అయినా గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.10 పెరిగింది. దీంతో వాహనదారులపై పెనుభారం పడింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.120 దాటింది. మరోవైపు డీజిల్ ధర రూ.107కి చేరింది.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను గమనిస్తే.. తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల ధర రూ. 119.49 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 105.49గా కొనసాగుతోంది. ఏపీలోని గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.44గా ఉంది. లీటర్ డీజిల్ ధరను రూ. 107.04 చొప్పున విక్రయిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41, డీజిల్ రేటు ప్రస్తుతం రూ. 96.67గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ను రూ. 120.51కి విక్రయిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 104 వద్ద ఉంది. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 110.95గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 101.04 వద్దకు చేరుకుంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.12గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.