Warning: ఏపీ, ఒడిశాలకు పొంచి ఉన్న కార్చిచ్చుల ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది.
వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు మార్పులు సంభవించే ప్రాంతాల్లో గడిచిన రెండు శతాబ్దాల్లో 89 శాతం కార్చిచ్చులు సంభవించినట్లు సీఈఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కార్చిచ్చులు చెలరేగడం సహజమేనని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కార్చిచ్చులను నియంత్రించడానికి ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని అభిప్రాయపడింది. అన్యాక్రాంతమైన అటవీ భూముల పునరుద్ధరణ, అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా కార్చిచ్చులను అడ్డుకోవచ్చని.. అడవి బిడ్డల జీవన ఆధారాన్ని కాపాడుకోవచ్చని సీఈఈడబ్ల్యూ ప్రతినిధి అవినాష్ మహంతి సూచించారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
అటు ఇప్పటికే కార్చిచ్చుల కారణంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. మన తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ఇలాగే జరిగితే అడవుల స్థాయి బాగా తగ్గిపోయి గడ్డిమైదానాలుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. తొమ్మిది దేశాలలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ అడవులకు ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయి.
https://ntvtelugu.com/woman-gave-birth-to-a-child-by-ivf-after-husband-died/
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..