వీకెండ్ సందర్భంగా ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్‌రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్ ఎలాంటి జట్టును బరిలోకి దింపుతాడో వేచి చూడాలి.
మరోవైపు సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబై జట్టు కూడా ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. బెంగళూరు జట్టు టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసింది. మరి ఈ మ్యాచ్‌లో బెంగళూరును ముంబై జట్టు ఓడిస్తుందా.. లేదో మరోసారి ఓటమిని కొని తెచ్చుకుంటుందో చూడాలి. కెప్టెన్ రోహిత్ పేలవ ఫామ్ నుంచి బయటపడితే ఆ జట్టు కష్టాలు తీరనున్నాయి. అటు బౌలింగ్ దళం కూడా వరుసగా విఫలమవుతోంది. బుమ్రా బాగానే బౌలింగ్ చేస్తున్నా అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు.