అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను […]
రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరంగా ఉందని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు. శనివారం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఛార్జీల భారం మోపడం బాధగానే ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తక్కువగా ఉన్నాయని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా […]
విశాఖ ప్రజలకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. ఈ మేరకు 76 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 54 మెట్రో స్టేషన్‌లు, రెండు డిపోలు నిర్మిస్తున్నట్లు […]
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు దేవాలయాల నిధులిస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. కొత్త జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు హిందూ దేవాలయాలు నుంచి నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం దేవాలయాల నుంచి నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమ్మఒడి గత ఏడాది ఇవ్వలేదని.. ఈ ఏడాది […]
ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. దీంతో టోర్నీలో ఆ జట్టుకు వరుసగా ఆరో ఓటమి ఎదురైంది. శనివారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(13) విఫలమయ్యారు. బ్రెవిస్ (31), సూర్య కుమార్ యాదవ్ (37), తిలక్ వర్మ(26) రాణించినా భారీ స్కోర్లు […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తోంది. శనివారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్‌తో మొదలైన ఈ యుద్ధం నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ‘బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు’ అంటూ బండ్ల […]
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం తన వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నానని హర్భజన్ ట్వీట్ చేశాడు. మన దేశం అభివృద్ధి చెందేందుకు తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా […]
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. శతృఘ్నసిన్హా (తృణమూల్ కాంగ్రెస్), బాబుల్ సుప్రియో (తృణమూల్ కాంగ్రెస్) విజయం సాధించారు. అస్సనోల్ లోక్‌సభను గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థానం అధికార పార్టీ టీఎంసీ వశమైంది. […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి 103 నాటౌట్‌తో నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు డికాక్ (24), మనీష్ […]