టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మంనతాలు జరిపారు. అనంతరం ఆయన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల హైదరాబాద్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈరోజు బొజ్జల గోపాలకృష్ణ జన్మదినం. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న చంద్రబాబు ఈ సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు తమ నివాసానికి రావడం చూసిన బొజ్జల కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. బొజ్జల కుర్చీకే పరిమితం కావడంతో ఆయన్ను చంద్రబాబు పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బొజ్జలతో చంద్రబాబు కేక్ కట్ చేయించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆత్మీయులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గారిని హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో కలిసాను. కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం, ఈ మధ్యనే కుదుటపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన.(1/2) pic.twitter.com/ZS27zOqnNv
— N Chandrababu Naidu (@ncbn) April 15, 2022