Metro Rail: విశాఖ వాసులకు శుభవార్త.. ఐదేళ్లలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ప్రజలకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. ఈ మేరకు 76 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 54 మెట్రో స్టేషన్‌లు, రెండు డిపోలు నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు వివరించారు. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రూ.14,309 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నేపథ్యంలో స్థానికుల స్థలాలకు, భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు యూజేఎం రావు స్పష్టం చేశారు. విశాఖలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు రాకతో ప్రయాణికులు, చిరు ఉద్యోగుల కష్టాలు మరో ఐదేళ్లలో తీరనున్నాయి.
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
Special Trains : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!