షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ క్రమంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి సారించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్‌ఎస్‌ఆర్ స్టేట్ కో ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్‌ను ఆమె నియమించారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తనను టీమ్ వైఎస్ఎస్ఆర్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పట్ల వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి […]
ప్రార్థనల సమయంలో మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు పెట్టడాన్ని మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉద్యమం చేస్తోంది. అయితే తాము చేపట్టిన ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణసేన అధినేత రాజ్‌థాకరే స్పష్టత ఇచ్చారు. తాము ముస్లింలు నిర్వహించుకునే ప్రార్థనలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ ముస్లింలు ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో నిర్వహిస్తే అప్పుడు తాము కూడా లౌడ్ స్పీకర్లను వినియోగించాల్సి వస్తుందన్నారు. చట్టం కంటే మతం పెద్దది కాదన్న విషయాన్ని ముస్లింలు గుర్తించాలని రాజ్‌థాకరే హితవు […]
నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసు వివరాలను తాజాగా నెల్లూరు ఎస్పీ విజయారావు మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా పరిశోధన చేసి ఈ కేసును ఛేదించామని తెలిపారు. అన్నింటికీ డిజిటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామని […]
ఏపీలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అంతేకాకుండా భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. […]
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా […]
ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్‌లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్‌లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్‌లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్‌లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. […]
ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుబట్టింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం […]
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ శుభవార్త అందించారు. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని నడక భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. దీంతో మెట్లు మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా నడక మార్గం మూతపడింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లు టీటీడీ మెంబర్ పోకల అశోక్ కుమార్ […]
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్‌ను గడగడా తాగేశాడు. చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి […]