టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ టీమిండియాను ఎలా […]
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా 1150 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 975 కరోనా కేసులు నమోదు కాగా.. నేడు అవి 1150కి పెరిగాయి. దీంతో ఒక్కరోజు తేడాలో 17 శాతం కరోనా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4,30,42,097కి చేరింది. ఇందులో 4,25,08,788 మంది […]
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన […]
అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ […]
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే మండు వేసవిలో ఓ గ్లాస్ చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. చెరుకులో పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటు ఐరన్, జింక్, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా దాగి ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి కూడా శరీరానికి లభిస్తాయి. వేసవిలో […]
ఏపీలోని విజయవాడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు కొత్తగా జాతీయ రహదారి ఏర్పడనుంది. బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హైవేపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అధికారులు రహదారిని నిర్మించనున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ జాతీయ […]
మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య తెచ్చిన టిఫిన్‌లో ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో ఓ భర్త ఆమె గొంతునులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిఖేష్ అనే 46 ఏళ్ల వ్యక్తి దహిసర్ ఈస్ట్ అనే ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నిర్మల అనే 40 ఏళ్ల భార్య ఉంది. వీరి దంపతులకు 12 ఏళ్ల కుమారుడు చిన్మయి కూడా ఉన్నాడు. అయితే శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో […]
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో […]
జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్‌లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా […]
ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే విజయం వరించింది. తొలి మ్యాచ్‌లో టార్గెట్ ఛేదించడంలో ముంబై ఇండియన్స్ చతికిలపడగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బొక్కా బోర్లా పడింది. ఓ దశలో వార్నర్ (66) పోరాటంతో గెలిచేలా కనిపించిన ఢిల్లీ చేతులారా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత […]