ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్‌లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన రిద్ధితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తనకు ఇచ్చిన ఒక ప్రత్యేక బహుమతి గురించి వెల్లడించింది.
Also Read : Mughal-e-Azam :ఇండియాస్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సాంగ్.. టికెట్ ధర రూ.2 అయినా వేల కోట్ల రికార్డు
ఆమె ఈవెంట్ లో ధరించిన వైట్ కలర్ చీరను ప్రభాస్ మూడేళ్ల క్రితమే ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారట.. “ప్రభాస్, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్‌కు చాలా థ్యాంక్స్. ఈ చీరను నువ్వు నాకు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చావు. ఈ ప్రత్యేకమైన వేడుకలో కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు దీనిని జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను” అని రిద్ధి భావోద్వేగంగా చెప్పింది. ఆమె మాటలకు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభాస్ గొప్ప మనసును చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే రిద్ధి కుమార్ ప్రభాస్‌ను ‘సార్’ అని కాకుండా నేరుగా ‘ప్రభాస్’ అని పేరుతో పిలవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే అలా పిలిచి ఉంటుందని కొందరు భావిస్తుంటే, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిద్ధికి ఇది ప్రభాస్‌తో రెండో సినిమా. గతంలో ఆమె ‘రాధే శ్యామ్’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. దీని కారణంగా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి ఉండవచ్చు.