చెన్నై ఆస్తి విషయంలో కేంద్ర మాజీ మంత్రి, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు ఊరట లభించింది. చెన్నై మైలాపూర్‌లోని 37,902 చదరపు అడుగుల భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని స్వయంగా హాజరుకావాలంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులను హైకోర్టు నిలిపివేసింది. ఏ వివరాల ఆధారంగా అశోక్‌గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ […]
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో రథోత్సవం సందర్భంగా కరెంట్ షాక్ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. తంజావూరు సమీపంలోని కలిమేడు గ్రామంలో ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసుస్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల […]
ఏపీ సీఎం జగన్ బుధవారం బిజీ బిజీగా గడపనున్నారు. కరోనా పరిస్థితులపై మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు, మంత్రులతో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్‌లో షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో […]
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్ […]
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, […]
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు. పదో […]
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… బుధవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=4pqx7tK3Ljg
★ ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. మే 9వ వరకు జరగనున్న పరీక్షలు.. హాజరుకానున్న 6,22,537 మంది విద్యార్థులు.. 3,776 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు ★ అమరావతి: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. 2024 ఎన్నికలే అజెండాగా […]
ఐపీఎల్ 2022: ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. రాజస్థాన్‌తో మంగళవారం రాత్రి జరిగిన పోరులో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నానా తంటాలు పడింది. చివరకు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. దీంతో 29 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 […]