రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గణపవరం హెలిప్యాడ్‌కు జగన్ చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు పిప్పర రోడ్డులోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు […]
దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా ఇప్పుడు సీఎన్‌జీ గ్యాస్ ధరల వంతు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సీఎన్‌జీల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిలో సీఎన్‌జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.73.61కి చేరింది. అటు నోయిడాలో రూ.76.71, […]
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. అలాంటిది 50 రోజులు దాటినా ఆర్.ఆర్.ఆర్ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంటే మాములు విషయం కాదు. […]
ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను ఈ నెల 16న రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రైతు బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.వీరిలో 47 లక్షల మంది భూ […]
ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న టీడీపీ మహానాడు వేదిక మారినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తొలుత ఒంగోలు శివారులోని త్రోవగుంట బృందావన్ గార్డెన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావించింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు నిలిచి బురదమయంగా తయారైంది. మరోసారి వర్షం పడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మహానాడు వేదికగా మార్చినట్లు టీడీపీ నేతలు వివరించారు. Minister Peddireddy: […]
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విలియమ్సన్ సేన ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఐదు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. ఆండీ రసెల్, శామ్ బిల్లింగ్స్ అదరగొట్టడంతో 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. Symonds: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. సైమండ్స్ కన్నుమూత అనంతరం 178 పరుగుల […]
★ తిరుమల: ఈరోజు తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు.. సాయంత్రం 5 గంటలకు నారాయణగిరి ఉద్యానవనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ★ విశాఖ: నేడు విశాఖ కనెక్ట్ అండ్ టూరిజం మెగా మీట్.. పాల్గొననున్న మంత్రి అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టూరిజం, ట్రావెల్స్ రంగ సంస్థలు ★ విశాఖలో నేడు బీచ్ క్లీన్ డ్రైవ్.. స్వచ్ఛ సముద్ర తీరం కార్యక్రమంలో పాల్గొననున్న నేవీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు ★ […]
ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు […]
నీట్ పీజీ- 2022 పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని, […]
కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడి దయతో ఈరోజు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు జగన్ వివరించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో […]