టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు ఇటీవల వరుస పరాజయాలను చవిచూస్తోంది. చివరకు బలహీన జట్లపైనా ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. గత 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. టెస్ట్ జట్టుకు కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను కోచ్‌గా అపాయింట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొద్దిరోజులుగా […]
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకంలో భాగంగా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో స్థలాలను అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి, నవులూరు పరిధిలో అమరావతి టౌన్‌షిప్‌లోని 331 స్థలాలను విక్రయించాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. ఆయా స్థలాలను ఈ-వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థలాలను సీఆర్‌డీఏ అధికారులు 12 లాట్‌లుగా విభజించారు. వీటిలో 200 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలాలు […]
గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17 […]
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్లే ఆఫ్స్ రేసు ద్వారాలు మూసుకుపోయాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత ముంబై ఇండియన్స్ బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. […]
★ నేడు కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. ఐ.పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ ★ చిత్తూరు: నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన.. ఈరోజు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు ★ తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం ★ అనంతపురం: నేటి నుంచి పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ★ నెల్లూరు: నేడు వెంకటాచలంలో గడప […]
ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్ […]
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్ […]
పాన్ కార్డుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త రూల్‌ను ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ వెల్లడించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు-1962లో సీబీడీటీ పలు సవరణలు చేసింది. కో ఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇప్పటికే ఒక […]
విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో మెడలో తాళి పడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో పెళ్లి పీటలపైనే ఓ వధువు ప్రాణాలు కోల్పోయింది. నగరం పాలెంలో బుధవారం రాత్రి 7 గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలైంది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. Vangalapudi Anitha: అత్యాచారాలకు కామానేనా? ఫుల్‌స్టాప్ పడేది ఎప్పుడు? సృజన […]
విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి […]