ఏపీలో వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రి పాలీసెట్-2022 నోటిఫికేషన్‌ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య వర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!! అగ్రి పాలీసెట్ పరీక్ష […]
ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. Andhra […]
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది. Matthew […]
ఏపీ సీఎం జగన్ రికార్డు సృష్టించారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సాధించారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ – 2022 ఫలితాలను వెల్లడించగా… ఈ ఏడాది కూడా ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. విభజన అనంతరం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం […]
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మదనపల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. Andhra Pradesh: ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్ […]
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషి అని 2017లో ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని వివరించి తనకు రెండు ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారంతో పాటు ఇల్లు ఇవ్వాలని సత్యంబాబు కలెక్టర్‌ను కోరాడు. దీంతో సత్యంబాబుకు సహాయం చేయాలని గతంలోనే నందిగామ ఎమ్మార్వోను కలెక్టర్ […]
ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలుచోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన లబ్ధి ఏమీ లేదని.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీదా జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం […]
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63, సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3 […]
విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యను మందకృష్ణ కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు. Andhra Pradesh: […]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు కానుంది. బయో డైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేసి ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో విశాఖ, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు బయో డైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు […]