Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న మార్కెట్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు దక్కడం కష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తమిళ హీరోల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణ ఇస్తుంటారని, అయితే అదే స్థాయిలో తెలుగు హీరోలకు తమిళనాడులో మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “కోలీవుడ్ హీరోలకు మనం ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు.. మన తెలుగు హీరోల సినిమాలకు కూడా అక్కడి ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు అదే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలి కదా” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తే ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించారని గుర్తు చేశారు. అయితే తెలుగులో విజయవంతమైన సినిమాలను తమిళంలో విడుదల చేయాలంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటోందని అన్నారు. ఇటీవల సూపర్ హిట్ సాధించిన ‘లెనిన్’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయాలని అనుకుంటే కనీసం అక్కడ సరిపడా థియేటర్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది ఒక్క సినిమా సమస్య కాదని, దాదాపు అందరి తెలుగు హీరోల చిత్రాలకూ ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదల సందర్భంగా కూడా అనుభవించానని కిరణ్ అబ్బవరం వెల్లడించారు. తమిళనాడులో తన సినిమాను రిలీజ్ చేయడం కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడినప్పుడు.. “మా తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోల సినిమాలు పెద్దగా చూడరు” అని వారు నేరుగా చెప్పారని అన్నారు. ఈ పరిస్థితి మారి రెండు పరిశ్రమల మధ్య పరస్పర సహకారం పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!