గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం సీఎంవో వరకు వెళ్లడంతో వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరి పంచాయతీ వివాదంపై పరిష్కరించేందుకు తొలుత బుధవారం సాయంత్రం రావాలని ఆదేశించినా… అనంతరం గురువారం సాయంత్రం 6గంటలకు తాడేపల్లికి రావాలని సీఎంవో సూచించింది. Crime News: గుంటూరు జిల్లాలో గుజరాత్ […]
నయా ప్రపంచంలో అమ్మాయిలు తెలివి మీరారు. గతంలో అయితే మాటలతో మత్తెక్కించి మాయ చేసేవాళ్లు. ఇప్పుడు మోడ్రన్ డ్రస్సులతో అట్రాక్ట్ చేస్తూ అమ్మాయిలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే ఫార్ములాను కొంతమంది గుజరాత్ అమ్మాయిలు గుంటూరు జిల్లాలో అమలు చేస్తున్నారు. ఊరు చివరల్లో కాపు కాసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డగించి వాళ్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. Loan Apps Harassments: లోన్ యాప్‌ల వేధింపులు.. యువతి బలవన్మరణం వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ […]
విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం […]
కొన్నిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన కడప జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్‌కు కంచుకోటగా చెప్పుకునే కడపలో టీడీపీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. నియంత పాలన సాగిస్తున్న జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం […]
కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ […]
ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. జూన్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఎందుకంటే జూన్ తొలివారంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నారు. అంతేకాకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్ […]
ఏపీలో ఈనెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై చర్చించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఈనెల 26 నుంచి 29 వరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు బస్సు యాత్రలు నిర్వహించి […]
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లను మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు వస్తుందని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడారంటూ వార్తలు వినిపించాయి. అలీ కూడా కొన్నిసార్లు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా […]
ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రటించింది. ఈ మేరకు ప్రిలిమినరీ ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రెండు నెలల కిందట జిల్లాల విభజన సందర్భంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైంది. అయితే ఈ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరుతున్నాయి. ఈ అంశంపై పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చోటుచేసుకున్నాయి. Andhra Pradesh: అగ్రి […]